తాజా వార్తలు

Saturday, 12 September 2015

స్మార్ట్ సిటీస్ నగరాల పనితీరు ఆధారంగానే కేంద్రం నిధులు

స్మార్ట్ సిటీస్ గా నగరాల పనితీరు ఆధారంగానే కేంద్రం నిధులు ఇస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు. వంద స్మార్ట్ సిటీస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. కొన్ని నగరాలు ఇప్పటికే రేసులో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. ఆయా నగరాల్లో చేపట్టే పనులు, వాటి అభివృద్ధికి ప్రణాళిక వంటివి పరిశీలించిన తర్వాత మొదటి ఏడాది 20 నగరాలను ఎంపిక చేస్తామన్నారు. వచ్చే ఏడాది 40, ఆ తర్వాతి ఏడాది మరో 40 నగరాలకు ఆర్థిక సహాయం చేస్తామని వెంకయ్య వివరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment