తాజా వార్తలు

Saturday, 19 September 2015

కుక్కల దాడిపై నారాయణ సీరియస్

విశాఖపట్నం జిల్లాలోని హార్బర్ పార్కు సమీపంలో నిన్న రెండేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన జరిగి 12 గంటలు గడవకముందే మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. అగనంపూడి ప్రాంతంలోని ఫార్మాసిటీ కాలనీలో ఇద్దరు బాలురపై కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. అలాగే ఈమర్రిపాలెం, కూర్మన్నపాలెం, గాజువాకలో ముగ్గురు వ్యక్తులపై కుక్కలదాడి చేశాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కుక్కల దాడి రెండేళ్ల చిన్నారి మృతి ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీల్లో కుక్కలను నియంత్రించాలని అధికారలను ఆదేశించారు. వారంలోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని మునిసిపల్‌ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment