తాజా వార్తలు

Saturday, 12 September 2015

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాగులు వంకల ద్వారా కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. జూరాల ప్రాజెక్టులోకి గరిష్టస్థాయికి నీటి మట్టం చేరింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటున్నది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో ఉదయం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment