తాజా వార్తలు

Sunday, 13 September 2015

పశ్చిమబెంగాల్ దారుణం

పశ్చిమబెంగాల్ 24 పరగణాల జిల్లాలోని గొసబా గ్రామానికి చెందిన అన్వర్ లష్కర్ అనే వ్యక్తి నివాసంలోని వంటింట్లో బాంబు పేలింది. ఈ ప్రమాదంలో  అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ప్రభావంతో ఇంటి పై కప్పు కూలడంతో అన్వర్ కుమార్తె సహా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు అన్వర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అన్వర్ పరారిలో ఉండటంతో అతడే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఇతనికి బాంబు ఎవరిచ్చారు. ఎక్కడ తయారయింది అనేకోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment