తాజా వార్తలు

Tuesday, 29 September 2015

యెమెన్‌ లో పెళ్లి వేడుకపై మిస్సైళ్ల దాడి, 131మంది మృతి

యెమెన్‌ దేశంలో ఓ పెళ్లి వేడుకపై జరిగిన మిస్సైళ్ల దాడి జరిగింది. దీంతో 131 మంది చనిపోయారు. ఎర్రసముద్రం తీరంలోని మోష ఓడరేవుకు సమీపంలో ఉన్న ఆల్ వాజిహాలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన వెంటనే పెళ్లి టెంట్లలోనే 27 మంది చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరో వంద మందికి పైగా మృతి చెందారు. హాతి రెబెల్ మూవ్ మెంట్ సంస్థ తమ సభ్యుడి పెళ్లి వేడుక నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది. ఐతే, ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని సౌదీ అరేబియా నాయకత్వంలో రెబల్స్ పై గత ఆర్నెళ్లుగా దాడులు చేస్తున్న సంకీర్ణ సేనల అధికారులు ప్రకటించారు. ఇది స్థానిక మిలిటెంట్ల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ ఖండించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment