తాజా వార్తలు

Friday, 11 September 2015

వరంగల్ లో ముగిసిన షర్మిల పరామర్శయాత్ర

వైఎస్ షర్మిల రెండో దశ పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో ముగిసింది. షర్మిల పర్యటనకు అపూర్వ స్పందన వచ్చింది. షర్మిలను చూసేందుకు ప్రజలకు ఉత్సూహకత చూపారు. అడుగడుగునా  బ్రహ్మరథం పట్టారు. ఐదు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో పర్యటించిన షర్మిల...మొత్తం 30 కుటుంబాలను పరామర్శించారు. 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించేందుకు జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టారు. కుటుంబసభ్యులను ఆత్మీయంగా పలకరించి ధైర్యం చెప్పారు.  ఈనెల 21,22 తేదీల్లో జిల్లాలో షర్మిల మూడవ విడత పరామర్శయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈనెల 23 నుంచి కరీంనగర్ జిల్లాలో పరామర్శయాత్ర మొదలవుతుందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment