తాజా వార్తలు

Saturday, 12 September 2015

ప్రశ్నిద్దాం..?నిలదీద్దాం..?వైఎస్సార్ సీపీ కరపత్రం విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనీతురుపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కరపత్రం విడుదల చేసింది. టీడీపీ మేనిఫెస్టో లో ఇచ్చిన 20 హామీలపై కరపత్రం ముద్రించింది. ఈసందర్భంగా  ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిందేమిటీ, చేసేదేమిటీ..ప్రశ్నిద్దాం..?నిలదీద్దాం..అని కరపత్రంలో పేర్కొంది. విజయయాత్రకు వస్తున్న సీఎం, మంత్రులను ప్రజలు నిలదీయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment