తాజా వార్తలు

Saturday, 24 October 2015

నాలుగు గంటల కోసం 400 కోట్లు ఖర్చురాజధాని శంకుస్థాపన పేరుతో నాలుగు వందల కోట్ల రూపాయలు దుబారా చేసిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పేదలపై,ప్రయాణికులపై ఆర్టిసి చార్జీలు 400 కోట్ల మేర పెంచేశారని కాంగ్రెస్ ఆరోపించింది. విజయవాడలో ఆర్టిసి బస్ స్టేషన్ ఎదుట చార్జీల పెంచినందుకు నిరసనగా కాంగ్రెస్,వామపక్షాలు ధర్నా చేశాయి. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.నాలుగు గంటల కార్యక్రమం కోసం 400 కోట్లు ఖర్చు చేశారని , పుష్కరాల పేరుతో 1600 కోట్లు, చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో 350 కోట్లు ఇలా ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై ఆ భారం మొత్తాన్ని మోపుతున్నారని వారు విమర్శించారు.చార్జీలను విరమించుకోకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment