తాజా వార్తలు

Thursday, 1 October 2015

విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఓ ఆటో డ్రైవర్ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు.  క్లాసులు ముగించుకుని ఇంటికి బయలుదేరేందుకు ఒక యువతి ఆటో ఎక్కింది. కొంత దూరం వెళ్లాకా ఆటోడ్రైవర్ ఆమెను లైంగికంగా వేధించాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న యువతి కదులుతోన్న ఆటోలోంచి దూకి అతని నుంచి తప్పించుకుని స్థానికులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment