తాజా వార్తలు

Saturday, 17 October 2015

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లిబృందం వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది.  ప్రమాదంలో 15మంది స్పాట్‌లోనే చనిపోగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..కందుకూరు మండలం చెర్లోపల్లి దగ్గర ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు... డీసీఎం వ్యాన్‌ను ఢీ కొట్టింది. క్షణాల్లోనే బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. రక్తంతో అక్కడి రోడ్డంతా తడిచిపోయింది. రెప్పపాటులో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎముకలు, కాళ్లు, చేతులు విరిగి... తలలు పగిలి ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు. స్పాట్‌లోనే 15మంది చనిపోగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. ఇటు ప్రమాదంలో మంటలంటుకుని బస్సు పూర్తిగా తగలబడిపోయింది. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది... లేకుంటే భారీగా ప్రాణనష్టం సంభవించేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.   
« PREV
NEXT »

No comments

Post a Comment