తాజా వార్తలు

Tuesday, 13 October 2015

మెదక్ జిల్లాలో నకిలీ మావోయిస్టుల కలకలం

మెదక్ జిల్లాలో  ఏడుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు ఏడుగురు సభ్యులుగల నకిలీ మావోయిస్టుల ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వారి వద్ద నుంచి రూ. 40 వేలు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వీరు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పలువురి వద్ద నుంచి మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేశారు. కాగా వీరిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment