తాజా వార్తలు

Sunday, 11 October 2015

హైదరాబాద్‌ లో ఓటర్ల జాబితా ప్రదర్శన

హైదరాబాద్‌ నగరంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నేడు ఓటర్ల జాబితా ప్రదర్శనకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఓటర్లు తమ పేరు జాబితాలో ఉన్నది లేనిది పరిశీలించుకోవాలని జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఇక ఓటరు జాబితాలో పేర్లు, అడ్రస్‌ సవరణలు కూడా చేసుకోవచ్చన్నారు. ఇక 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సిబ్బందిని ఇందుకోసం నియమించినట్టు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రదర్శనలో ఓటర్లు తమతమ పేర్లను సరిచూసుకుంటున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment