తాజా వార్తలు

Saturday, 31 October 2015

'షేర్‌' ఓ చక్కని కామెడీ ఎంటర్‌టైనర్‌

డేరింగ్‌ స్టార్‌ నందమూరి కళ్యాణ్‌రామ్‌ - సోనాల్‌ చౌహాన్‌ జంటగా మల్లిఖార్జున్‌.ఎ దర్శకత్వంలో విజయలక్ష్మి పిక్చర్స్‌ పతాకంపై కొమర వెంకటేష్‌ నిర్మించిన చిత్రం 'షేర్‌'. తమన్‌ ఎస్‌.ఎస్‌ సంగీతం అందించారు. షేర్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న రిలీజై ఘనవిజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ ..-''షేర్‌ రిలీజ్‌ రోజునుంచి మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలొచ్చాయి. కళ్యాణ్‌రామ్‌ మునుపటి కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించారని, చక్కని అభినయంతో ఆకట్టుకున్నాడని అంతా ప్రశంసిస్తున్నారు. ఫైట్స్‌, పాటల్లో కళ్యాణ్‌రామ్‌ పెర్ఫామెన్స్‌ చాలా ప్రత్యేకంగా ఉందన్న టాక్‌ వచ్చింది. అలాగే కామెడీ సన్నివేశాలు వచ్చినప్పుడు ఆడియెన్‌ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం, రఘు కారుమంచి, పృథ్వీ సహా హాస్యనటులతో తెరకెక్కించిన సన్నివేశాలకు అందరూ బాగా నవ్వుకుంటున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని చిత్రమిదన్న ప్రశంసలొచ్చాయి. ఆడిటోరియం నుంచి హాస్య సన్నివేశాలు వచ్చినప్పుడు ఒకటే సందడి. ఈ విజయం నా హీరో కళ్యాణ్‌రామ్‌, నా నిర్మాత కొమర వెంకటేష్‌ వల్లనే సాధ్యమైంది. కళ్యాణ్‌రామ్‌ మరోసారి చక్కని సహకారం అందించి నటించారు. అది సినిమాకి పెద్ద ప్లస్‌ అయ్యింది. మా నిర్మాత కొమర వెంకటేష్‌ ప్రతి ఫ్రేము రిచ్‌గా, చక్కగా వచ్చేందుకు కావాల్సిన అన్ని వసతుల్ని కల్పించారు. పరిశ్రమకి ఇలాంటి నిర్మాతలు చాలా అవసరం. ప్రతి దానిని కమర్షియల్‌ కోణంలో ఆలోచించకుండా సినిమా బావుండాలని నిర్మాత పనిచేశారు. డైమండ్‌ రత్నం మాటలు, చంటి యాక్షన్‌, తమన్‌ సంగీతం ప్రతిదీ సినిమాలో హైలైట్‌. తమన్‌ అందించిన పాటలు, రీరికార్డింగ్‌ సినిమాకి ప్రధాన బలం. ముఖ్యంగా ఈ సినిమా చివరి 25 నిమిషాలు థియేటర్లలో ఆడియెన్‌ని ఎంతో మెస్మరైజ్‌ చేసింది. ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్‌రామ్‌, కొమర వెంకటేష్‌లకు రుణపడి ఉంటాను'' అని అన్నారు. 

చిత్ర నిర్మాత (చిత్రపురి కాలనీ అధ్యక్షుడు, ఫెడరేషన్‌ అధ్యక్షుడు) కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ -''షేర్‌ చిత్రానికి రిలీజ్‌ రోజు నుంచి ఆడియెన్‌లో ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది.. ఇదో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ముఖ్యంగా మా హీరో కళ్యాణ్‌రామ్‌ నటన చిత్రానికే హైలైట్‌. పాటల్లో, డ్యాన్సుల్లో చాలా అందంగా కనిపించాడన్న ప్రశంసలొచ్చాయి. అలాగే హాస్యం సినిమాకే హైలైట్‌ అన్న టాక్‌ వచ్చింది. ముఖ్యంగా చివరి 25 నిమిషాల పాటు థియేటర్లలో ఆడియెన్స్‌ నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. హైదరాబాద్‌ లోకల్‌గా థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల స్పందన చూశాం. అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా కామెడీ, పాటలు, ఫైట్స్‌ సినిమాలో హైలైట్‌గా ఉన్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు. నా వెంట ఉండి ప్రోత్సాహం అందించిన అందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు'' అన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment