తాజా వార్తలు

Friday, 30 October 2015

నిహారిక సినిమా ట్రైలర్ కు మంచి ఆదరణ

నిహారిక నటించిన ముద్దపప్పు ఆవకాయ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నది. విడుదలైన ఒక్కరోజులోనే లక్షమంది వీడియోను చూసేసి..లైక్ లు, పంచ్ కామెంట్ లు పెట్టేశారు. సినిమా వివరాల్లోకి వెళితే.. పింక్ ఎలిఫెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ’. నిహారిక స్వీయ నిర్మాణ సారథ్యంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్‌ను నటుడు నాగబాబు విడుదల చేశారు. ముద్దపప్పు ఆవకాయ లో నిహారిక ఆశా పాత్రలో కనిపించనుంది. అర్జున్ అనే పాత్రలో మరో నటుడు కనిపించనున్నారు. ముద్దపప్పు ఆవకాయ ఎంటర్‌టైన్‌మెంట్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సమాచారం.  ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఈ సిరీస్‌ను ఎపిసోడ్‌లుగా డిజైన్ చేసి విడుదల చేయనున్నారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిహారిక త్వరలోనే వెల్లడించనున్నారు. తాజా వెబ్ సిరీస్ కోసం ఏ ఫర్ ఆశ, ఏ ఫర్ అర్జున్ ఎవరంటూ టాలీవుడ్ స్టార్స్ కాజల్, మంచు లక్ష్మి, నాని, సాయిధరమ్‌తేజ్, సందీప్ కిషన్ లతో రూపొందించిన ప్రొమోవీడియోలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment