తాజా వార్తలు

Saturday, 3 October 2015

పులి సమీక్ష

విజయ్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘పులి’. చాలా కాలం తర్వాత ఎవర్గ్రీన్ బ్యూటీ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమాలో శృతి హాసన్, హన్సికలు హీరోయిన్స్ గా నటించారు. కన్నడ స్టార్ సుధీప్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకి చింబుదేవన్ దర్శకుడు.మరి ఈ సోషియో ఫాంటసీ ఏ మేరకు మెప్పించిది అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
భేతాళ దేశాన్ని పరిపాలించే రాణి శ్రీదేవి. ఆమెకి దళపతి అయిన సుధీప్ ప్రజలని హింసలు పెడుతూ, వారిని బానిసలుగా ట్రీట్ చేస్తూ వారి పంట, ధనాన్ని లాక్కుంటూ ఉంటారు. కానీ ఆ భేతాళ దేశం కింద ఉండే గ్రామాల్లో భైరవ కోన ఒకటి. ఆ భైరవకోనకి నాయకుడు ప్రభు. అతనికి నదిలో కొట్టుకు వచ్చిన ఓ బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డనే విజయ్. సుధీప్ విజయ్ ని భేతాళ జాతిని అడ్డుకోగల వీరుడిలా తయారు చేస్తాడు. ఇదిలా ఉండగా విజయ్ అదే కోనలో ఉండే శృతి హాసన్ తో ప్రేమలో పడతాడు. వీరిద్ద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. అదే సమయంలో భేతాళ జాతి వారు వచ్చి భైరవ కొనలోని వారిని కొట్టి, శృతిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. దాంతో మన విజయ్ శృతి కోసం భేతాళ దేశానికి బయలు దేరుతాడు. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే పలు చిక్కులు ఉంటాయి. భేతాళ దేశంలో తను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది..వెండితెరపై చూడాలి.  
« PREV
NEXT »

No comments

Post a Comment