Writen by
vaartha visheshalu
02:29
-
0
Comments
సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. దాడిలో రెండు కెమరాలు పలువురు జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి. అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ కు మంత్రులు శనివారం ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై చిత్రయూనిట్ సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు కెమెరామెన్ లకు గాయాలయ్యాయి. దీంతో పవన్ బౌన్సర్ల దాడిని ఖండిస్తూ వీడియో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. బౌన్సర్లు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సాధారణంగా మీడియాకు ఇబ్బంది కలిగే పరిస్థితిని తాను కల్పించనని, అయితే అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి మంత్రులు వచ్చిన సందర్భంగా మీడియా సిబ్బందిపై జరిగిన దాడికి క్షమాపణలు చెబుతున్నానని సినీహీరో పవన్ కల్యాణ్ చెప్పారు. సాధారణంగా ఎవరో ఒకరు తమ షూటింగు ప్రాంతంలోకి వచ్చేస్తుంటారని, కొంతమంది కెమెరాలతో కూడా వస్తుంటే వాళ్లను తమ సిబ్బంది అడ్డుకుంటారని, వచ్చింది మీడియా అని తెలియకపోవడంతో ఇలా చేసి ఉంటారని పవన్ అన్నారు. దెబ్బలు తగిలిన వాళ్లకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానన్నారు. దాడి చేసిన వాళ్లు ఎవరో గుర్తించి వారికి సరైన పనిష్మెంట్ కూడా ఇస్తానని తెలిపారు. పవన్ సమాధానంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.
No comments
Post a Comment