తాజా వార్తలు

Thursday, 1 October 2015

కరీంనగర్ లో షర్మిళ రెండోవిడుత పరామర్శయాత్ర

వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. మలివిడత పరామర్శయాత్రలో భాగంగా కరీంనగర్ కు చేరుకున్న షర్మిలకు తోటపల్లి వద్ద  వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హుస్నాబాద్ లో షర్మిల రోడ్ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలో మొత్తం 8 కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. సముద్రాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి షర్మిల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మొత్తం 30 మంది చనిపోయారు. సెప్టెంబర్ 22,23,24 తేదీల్లో వైఎస్ షర్మిల జిల్లాలో పర్యటించి మొత్తం 12 కుటుంబాలను ఓదార్చారు. మిగిలిన 18 కుటుంబాలను పరామర్శించేందుకు మలివిడత యాత్ర చేపట్టారు. మూడ్రోజుల పాటు మొత్తం 481 కి.మీ. మేర వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతుంది. షర్మిల వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర  నేతలు ఉన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment