తాజా వార్తలు

Thursday, 1 October 2015

అమెరికాలో మహిళకు మరణశిక్ష

అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష వేశారు. వివరాల్లోకి వెళితే దక్షిణ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తొలిసారి ఓ మహిళకు మరణశిక్ష అమలుచేశారు. 1997లో డగ్లస్ గిస్సెండనేర్‌ను అతడి భార్య కెల్లీ రెనీ ప్రేమికుడితో కలిసి హతమార్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు ఆమె చేసిన నేరాన్ని తీవ్రంగా పరిగణిస్తూ మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో పలుమార్లు ఆమె క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తిరస్కరణకు గురయ్యాయి.  ఆమెకు మంగళవారం విషపు ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment