తాజా వార్తలు

Tuesday, 13 October 2015

ప్రత్యేక హోదా కోసం భవిష్యత్ కార్యాచరణ

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కార్యచరణ వివరాలను మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకూ నిరసన మార్చ్ జరుగుతుందన్నారు. ఈ నిరసన మార్చ్ లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొంటారని అంబటి తెలిపారు.

*ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు
* 18న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు
*19న నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు
*20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ
*21న బస్సు డిపోల ముందు ధర్నాలు
« PREV
NEXT »

No comments

Post a Comment