తాజా వార్తలు

Monday, 26 October 2015

అద్భుత రాజధానికి అంకురార్పణ..తెలుగుదేశం పార్టీని మూడు దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా వర్థిల్లుతుందంటే దానికి కారణం ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు. వీరిద్దరూ పార్టీ పగ్గాలు చేతపట్టి అన్నీ తామై పార్టీని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళిన విజయ సారథులు. వెండితెర వేల్పుగా ఎన్టీఆర్ కు అఖండ ప్రజాదరణ ఉంది. అది ఆయన ఏ పని చేసినా, శ్రీ రామరక్షలా వెన్నంటి నిలిచింది. కానీ చంద్రబాబుకు అలాంటి ఆకర్షణ లేదు. అయినప్పటికీ సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతో, పాలనా సామర్థ్యాలతో ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తెలుగుజాతికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించగల నాయకుడిగా చంద్రబాబుకు ప్రజలలో పేరుంది. అందుకే నవ్యాంధ్ర బాధ్యతలు ప్రజలు ఆయనకు అప్పచెప్పారు. వారు విశ్వసించినట్టే అద్భుత రాజధానికి అంకురార్పణ జరిగింది.
అంతేకాదు తెలుగుజాతి ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న పవిత్రమైన ఎన్టీఆర్ ఆశయాన్ని, పేదవాడికి అండగా నిలబడాలన్న పార్టీ మూల సిద్ధాంతాన్నీ చంద్రబాబు మరువకుండా ముందుకు వెళ్తున్నారు


చంద్రబాబు విద్యుత్ సంస్కరణల ఫలం 

విద్యుత్ పొదుపు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రధమం
విద్యుత్ సరఫరా మరియు పంపిణీలలో నష్టాలను 11.36 నుంచి 9 శాతానికి తగ్గించుకునే ప్రణాళికలతో విద్యుత్ పొదుపులో దేశంలోనే ప్రధమంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. తరువాతి స్థానాలలో మహారాష్ట్ర, పంజాబ్ లు నిలిచాయి.

ఈ ప్రణాళికల ప్రకారం విద్యుత్ సరఫరా మరియు పంపిణీలలో నష్టాలను తగ్గించుకోడం ద్వారా ఏడాదికి రూ.1500 కోట్లు పొదుపు చేసుకుంటుంది ఎపి ట్రాన్స్ కో.
అత్యంత స్వల్పంగా సరఫరాలో 3. 34 శాతం , పంపిణీలో 2. 15 శాతం మాత్రమే నష్టాలను నమోదుచేసి దక్షిణ భారతదేశంలోనే ఆదర్శంగా నిలచింది విశాఖపట్నం జిల్లా.

News Desk-Special Bureau
« PREV
NEXT »

No comments

Post a Comment