తాజా వార్తలు

Sunday, 4 October 2015

ఎయిడ్స్ కు మందు ట్రువాడా మెడిసన్ ?

రెండున్నరేళ్ల క్రితం హెచ్‌ఐవీని నిరోధించేందుకు కనిపెట్టిన ట్రువాడా మాత్ర విజయవంతం అయిందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అమెరికాలోని కైసర్ పర్మనెంటీ సైంటిస్ట్‌లు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగుచూసింది. సుమారు 600మందిపై తాము ట్రువాడా మాత్రను ప్రయోగించామని.. వారిలో చాలామంది ఆరోగ్యంగా ఉన్నారని.. ఇప్పటికీ ఏ ఒక్కరికి కూడా హెచ్‌ఐవీ సోకలేదని పరిశోధకులు పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ట్రువాడా మాత్ర వందశాతం పని చేసిందనీ.. హెచ్‌ఐవీ వైరస్ బారి నుంచి కాపాడిందని హర్షం వ్యక్తం  చేస్తున్నారు.  ఇంకా కొన్ని పరిశోధనలు జరపాల్సి ఉందనీ.. ఆ తర్వాత ట్రువాడా మాత్రను మార్కెట్‌లోకి తెచ్చేందుకు కృషి చేస్తామని సైంటిస్ట్‌లు వివరించారు!
« PREV
NEXT »

No comments

Post a Comment