తాజా వార్తలు

Saturday, 17 October 2015

చైతూ కి కౌంటర్ ఇచ్చిన అఖిల్ఒక పెద్ద సినిమా డేటు మారిందంటే ఎన్ని తలనొప్పులుంటాయో.. దాంతో పాటు ఎన్ని సినిమాలు డేట్లు మార్చుకోవాల్సి ఉంటుందో చాలాసార్లు చూశాం. ఇప్పుడు ‘అఖిల్’ విషయంలో మరోసారి అదే అనుభవం ఎదురవుతోంది. దసరా సందర్భంగా ఈ నెల 22న విడుదల కావాల్సిన ‘అఖిల్’ సినిమా గ్రాఫిక్స్ లేటవుతుండటం వల్ల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తర్వాతి రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పలేదు కానీ.. దీపావళికి విడుదలయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కొన్ని రోజుల గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే మిగిలి ఉందన్నారు కాబట్టి మరీ లేటయ్యే అవకాశాలు లేనట్లే. అక్కినేని అభిమానులు దీపావళికే అఖిల్ హంగామా చూడ్డానికి రెడీ అయిపోవచ్చు.

ఐతే ‘అఖిల్’ దీపావళికి వచ్చేట్లయితే మరో అక్కినేని కథానాయకుడికి ఇబ్బందే. అఖిల్ అన్నయ్య నాగచైతన్య.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను దీపావళికి విడుదల చేద్దామనుకున్నారు. నవంబరు 11న డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఐతే ‘అఖిల్’ దీపావళికి వచ్చి పడేలా ఉండటంతో దాన్ని వాయిదా వేసుకోక తప్పదు. ఒకవేళ నవంబరు 6, 11 తేదీల్లో కాకుండా తర్వాతి వారం ‘అఖిల్’ వచ్చేట్లున్నా.. ‘సాహసం శ్వాసగా..’ ముందు అనుకున్న తేదీకి రావడం కష్టమే అవుతుంది. అఖిల్ తొలి సినిమాకే అన్న పోటీగా ఉండటం బాగోదు కదా. కాబట్టి ‘అఖిల్’ డేటును బట్టే చైతూ తన సినిమా విడుదల సంగతి చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి దసరా రేసు నుంచి తప్పుకోవడం ద్వారా అభిమానులకే కాదు.. అన్నయ్యకూ పంచ్ ఇచ్చాడు అఖిల్.

FILM DESK
« PREV
NEXT »

No comments

Post a Comment