తాజా వార్తలు

Tuesday, 20 October 2015

ప్రజా రాజధాని శంకుస్థాపన ఆహ్వానం..."ఐదు కోట్ల నవ్యాంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతి. ఇది ప్రజలు ఆకాంక్షించిన ప్రజా రాజధాని. అమరావతి శంకుస్థాపన సుముహూర్త సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో, ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి నగరంలోని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. యావత్ దేశంలోనూ, విదేశాల్లోని తెలుగు లోగిళ్ళలోనూ ఇపుడు అమరావతి శంకుస్థాపన ఏర్పాట్ల గురించే చర్చ. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ప్రజా పండుగ. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో జరుగుతున్న అపూర్వ వేడుక. చరిత్ర పులకించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి. అందుకే శంకుస్థాపన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రండి! తరలిరండి!! కలకాలం గుర్తుండేలా ఈ వేడుకలో పాలు పంచుకోండి."
మీ
నారా చంద్రబాబు నాయుడు
« PREV
NEXT »

No comments

Post a Comment