తాజా వార్తలు

Thursday, 22 October 2015

ఈ ముగ్గురి వలనే ఇది అంతా...???ప్రత్యేక హోదా అడిగితే, ప్రధాన మంత్రి ఏమనుకుంటారో.! - ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భయం 
నాకెందుకొచ్చిన గొడవ ఇది - ఇది కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆలోచన 
అసలు నాకేం సంబంధం - ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీ భావన 
విచ్చితంగా ఈ ముగ్గురిలో ఇద్దరిది ఆంధ్రప్రదేశ్‌. జన్మతః వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు. ఈ ఇద్దరూ కలిసి అమరావతి శంకుస్థాపన వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నోట్లో మట్టిగొట్టారు. పక్కనే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి కూడా వున్నా.. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు అతి ముఖ్యమైన వ్యక్తులుగా చంద్రబాబు, వెంకయ్య తర్వాతే ఎవరైనా వుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. 
కానీ, చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు లేదు. కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండొచ్చుగాక, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావొచ్చుగాక. అందుకేనేమో, ఓటు హక్కు లేదు గనుక, ఆంధ్రప్రదేశ్‌ని నేనెందుకు పట్టించుకోవాలి.? అనుకుంటున్నారు చంద్రబాబు. తెలంగాణలో స్థిరపడ్డ తాను, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని తెలంగాణలో లీగల్‌ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్‌తో రాజీపడి, ఆ క్రమంలో కేంద్రాన్ని ఒప్పించి, ప్రత్యేక హోదా డిమాండ్‌ని కేంద్రం పాదాల వద్ద తాకట్టుపెట్టేశారు చంద్రబాబు. 
ఇక, వెంకయ్య విషయానికొస్తే.. ఈయనగారూ చెప్పుకోడానికి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తే. కానీ, ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నది కర్నాటక నుంచి. 'అసలు నేను ఈ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిథినే కాదు. నేను కాకపోతే మీకెవరు దిక్కు.?' అని ఓ సందర్భంలో మనసులోని 'అహంకారాన్ని' బయటపెట్టేసుకున్నారు వెంకయ్యనాయుడు. ఇంత అహంకారం వున్న నాయకులు ఆంధ్రప్రదేశ్‌కి ఏదన్నా ఒరగబెట్టేస్తారని ఎలా అనుకోగలం.? 
జాతీయ స్థాయి సంస్థలు కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నమాట వాస్తవం. అదేదో ఆంధ్రప్రదేశ్‌కి బిచ్చం వేస్తున్నామనుకుంటే ఎలా.? దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒక రాష్ట్రమే. కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. ఏపీ నుంచి పలువురు ముఖ్యులు కేంద్రంలో మంత్రులుగా వున్నారు. ఏపీలో, కేంద్రంలో బీజేపీ, టీడీపీ అధికారం పంచుకుంటున్నాయి. అది ప్రజలు ఇచ్చిన అధికారమే కదా. 
నరేంద్రమోడీ విషయానికొద్దాం. పబ్లిసిటీ పీక్స్‌లో వుంటే, పనులు పాతాళంలోనే వుంటాయి. ఇదీ నరేంద్రమోడీ నైజం అని మరోమారు స్పష్టమైపోయింది. మాటలే తప్ప, చేతల్లో చూపించలేని ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రకెక్కుతున్నారు. ఏడాదిన్నర కాలంలోనే నరేంద్రమోడీ ఘనత ఏంటో దేశ ప్రజలకు బాగా అర్థమవుతోంది. అయినా, ఏపీకి చెందిన చంద్రబాబు, వెంకయ్యే 'ప్రత్యేక హోదా'పై శ్రద్ధ చూపనప్పుడు తానెందుకు గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.? అని ఆయన అనుకుంటున్నారు. 
ఇదీ ముచ్చటగా ఆ ముగ్గురు నేతలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై చూపుతున్న నిర్లక్ష్యం
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment