తాజా వార్తలు

Sunday, 11 October 2015

మళ్లీ నేలమాలిగలో సంపద లెక్కలు

అనంత పద్మనాభస్వామి ఆలయంలో విలువైన సంపదను మరోసారి లెక్కంచనున్నారు. ఆలయ నేల మాళిగలో సంపద లెక్కలను రెండోసారి తనిఖీ చేయాల్సిందిగా మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తూతో కూడిన ధర్మాసనం ఆదేశాలు వెలువరించింది. గతంలో తాను చేసిన ఆడిట్ పై వినోద్ రాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేసారు . అయితే అవకాశం ఉంటే మరోసారి తనిఖీలు నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాయ్‌ పేర్కొనడంతో కోర్టు ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించింది. దీంతో త్వరలో మళ్లీ నేలమాలిగలో సంపదను రాయ్ లెక్కించనున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment