తాజా వార్తలు

Friday, 30 October 2015

అనూహ్య కేసులో చంద్రబానుకు ఉరిశిక్ష

అనూహ్య హత్య కేసులో ముంబై ప్రత్యేక మహిళా న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. 22 నెలలపాటు జరిగిన సుదీర్ఘ విచారణలో పోలీసులు తమకు దొరికిన ఆధారాలతో నిందితునిపై మోపిన అభియోగాలను నిరూపించగలిగారు. దీంతో కోర్టు చంద్రభానుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అనూహ్యపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితుడు చంద్రభానుకు ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈమేరకు చంద్రభానును దోషిగా పేర్కొంటూ న్యాయమూర్తి వృషాలి జోషీ ఉరిశిక్ష విధించారు. భారతీయ శిక్షాస్మృతిలోని 302(హత్య), 376(అత్యాచారం), 397(దోపిడి, హత్య) సెక్షన్ల కింద శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment