తాజా వార్తలు

Wednesday, 28 October 2015

ఆంద్రప్రదేశ్ లో మానవ వనరులు పుష్కలంఅటు యూపీఏ ఇటు ఎన్డీయే కూటములు రెండూ విభజన పేరుతో ఆంద్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేయడం నిజమే. ఈ విషయంలో శత్రువు సైతం అయ్యో అని సానుభూతి ప్రకటించాల్సిన దుస్థితి మనది. దానికి తోడు రెండు విధాలా వాగ్దాన భంగాలతో - కాంగ్రెస్ - బీజేపీ నమ్మక ద్రోహాలతో రాష్ట్ర ప్రజలు సగం సచ్చి ఊరుకున్నారిప్పుడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర మానవ వనరులు ప్రపంచాన్ని విశేషంగా ఆకర్షిస్తుండటం చూస్తుంటే సరైన విజన్తో ముందుకెళితే రాష్ట్ర భవిష్యత్తుకు ఢోకా ఉండదనే అనిపిస్తోంది. ప్రత్యేకించి.. మానవ వనరుల అందుబాటులో ఉండే విషయంలో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అదనపు వెసులుబాటు పరిశ్రమలను ఆహ్వానిస్తున్నదని అనుకోవాలి. కొన్ని ఇతర రాష్ట్రాలు మానవ వనరుల విషయంలో చేతులెత్తేసాక కూడా ఆ అవకాశాలు మన రాష్ట్రానికి తరలి వస్తుండడం విశేషం.

బయటి రాష్ట్రాలలో తమ ఉత్పాదక యూనిట్లను పెట్టాలని నిర్ణయించుకున్న కంపెనీలు కూడా ఆ నిర్ణయాలను మార్చుకుని రాష్ట్రానికి తరలిరావాలని అనుకుంటుండమే కాదు. కొన్ని సంస్థలు అవకాశాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రం తలుపును  తట్టాయి కూడా. అలాంటి వాటిలో తాజా కంపెనీ లావా ఇంటర్నేషనల్. దేశంలోనే నాలుగో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారైన లావా.. తన ఉత్పత్తి యూనిట్ ను ఏపీలోని తిరుపతిలో నెలకొల్పాలని నిర్ణయించింది. 500 కోట్ల విలువైన  ఈ విభాగానికి ఏపీ ప్రభుత్వం 20 ఎకరాల స్థలాన్ని కూడా మంజూరు చేసింది. ఇటీవలే తిరుపతి సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ లావా ఇంటర్నేషనల్ హ్యండ్ సెట్ - ఎలెక్ట్రానిక్ తయారీ యూనిట్ కి శంకుస్థాపన చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.  ఇప్పటికే మైక్రోమాక్స్ - సెల్ కాన్ సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లను పెట్టడానికి ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు చేసుకున్నాయి ఇప్పుడు లావా.. కూడా గోవాలో తను తలపెట్టిన యూనిట్ ని ఉపసంహరించుకుని ఆంద్రప్రదేశ్ కు తరలించాలని నిర్ణయించింది. దీనికి విస్తృతంగా పన్ను రాయితీలు అధిక సబ్సిడీల ఆకర్షణ ఒక్కటే కారణం కాదు.

లావా ఇంటర్నేషనల్ ఎక్కడ తన యూనిట్ పెట్టినా 15 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించగలదు. కాని కంపెనీ కోరుకున్న మానవ వనరులను సరఫరా చేయగల సామర్థ్యం తనకు లేదని గోవా ప్రభుత్వం చేతులెత్తివేసిన ఫలితంగానే ఏపీకి ఆ అవకాశం వచ్చింది. మనకున్న మానవ వనరుల దన్నును గమనించయినా సరే ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటే కొన్ని వేలమందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా బాబు వస్తే జాబు వస్తుందని గప్పాలు కొట్టారు.. ఇప్పటి దాకా ఉద్యోగాలు ఏవీ రాలేదు.. ...!
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment