తాజా వార్తలు

Monday, 5 October 2015

ప్రతిపక్షాల సస్పెండ్

శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు రైతు సమస్యలపై మళ్లీ చర్చించాలంటూ పట్టుబట్టాయి. స్పీకర్ పొడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో మంత్రి హరీష్‌రావు సభ సజావుగా సాగాలంటే ఆందోళన చేస్తోన్న సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. సభ తీర్మానాన్ని ఆమోదించడంతో సమావేశాలు ముగిసే వరకు కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి, టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఎంఐఎం సభ్యులు మినహా మిగతా కాంగ్రెస్ సభ్యులు, టీడీపీ, సీపీఐ, బీజేపీ, వైసీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు సభలో నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ శాసనసభ నుంచి ప్రతిపక్ష సభ్యలను సస్పెండ్‌ చేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియాతో పాయింట్ వద్ద మాట్లాడుతూ మామ, అల్లుడు శాసనసభను ఆటవిడుపు కేంద్రంగా మార్చారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఉద్యమిస్తామన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment