తాజా వార్తలు

Thursday, 1 October 2015

బీహార్ ప్రజలకు బీజేపీ వరాలు

బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ ప్రజలకు బీజేపీ భారీగా ఎన్నికల వరాలు ప్రకటించింది. చదువులో ఉన్నతంగా రాణించిన విద్యార్థులకు ఫ్రీ ల్యాప్ ట్యాప్స్, పది, 12 తరగతుల్లో మెరిట్ సాధించిన బాలికలకు ఫ్రీ స్కూటీస్, దళిత మహిళలకు ఉచిత కలర్ టీవీలు, వెనకబడిన వర్గాల పిల్లల ఉన్నత చదువుకు విద్యా రుణాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వ్యాపార రుణాలు, భూమిలేని పేదలకు స్థలాలు, అటల్ మెడిసిన్ సెంటర్స్ ద్వారా తక్కువ ధరకు మందులు వంటి పలు పథకాలను బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను గురువారం విడుదల చేశారు. పలు వర్గాలకు ఉచిత వస్తువులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.   
« PREV
NEXT »

No comments

Post a Comment