తాజా వార్తలు

Thursday, 15 October 2015

బాబుకు బీజేపీలో ఒక కమ్మనైన ఫ్యాన్ దొరికాడు అంటా మరి....!భవిష్యత్తు గురించి అంతర్గత వ్యూహాలతో ముందుకు పోతున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. ఏ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక వ్యూహాలతో.. కొత్త పొత్తులు, ఎత్తులతో జాతీయ స్థాయిలో కార్యాచరణ జరుగుతోందనేది నిజం. ఢిల్లీ లెవల్లో జరుగుతున్న ఈ మంత్రంగానికి అనుగుణంగానే రాష్ట్రాల స్థాయిలో బీజేపీ సంబంధిత రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి.
మరి ఈ కోణం నుంచి చూస్తే.. ఏపీ లెవల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల స్నేహం కూడా ఆసక్తికరమైన అంశమే. ఈ స్నేహంలో ఈ మధ్య విమర్శలు చేసుకునేంత విబేధాలు పొడసూపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతలు డోంట్ కేర్ అన్నట్టుగా చంద్రబాబును విమర్శిస్తున్నారు.
ప్రత్యేకించి మాణిక్యాల రావు, సోమూ వీర్రాజు వంటి వారు బాబును అవకాశం ఉన్నప్పుడు కడిగేస్తున్నారు. వెంకయ్య నాయుడు వంటి వాళ్లు బాబుకు సన్నిహితులు.. బాబు తరపున చాలా వ్యవహారాలు సర్ధిపెట్టడానికి ఇప్పుడు చాలా ప్రయాస పడుతున్నారు. మరి వాళ్ల బంధంలో ఉన్న కమ్మదనం అలాంటిది! ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడే ఏతావాతా బీజేపీలో చంద్రబాబుకు ఫ్యాన్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
రాష్ట్ర స్థాయి నేతల్లో బాబును ఇంద్రుడు.. చంద్రుడు.. అని పొగిడే వాళ్ల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయింది. సోమూ వీర్రాజు అయితే బాబుపై ఒక్కోసారి మాటల దాడి తీవ్రతరం చేస్తున్నారు. ఇక పోలవరం, పట్టిసీమ వంటి ఇష్యూల్లో బాబును చాలా మంది భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు.
మరి ఇలాంటి నేపథ్యంలో కూడా బాబుకు బీజేపీలో ఒక ఫ్యాన్ ఉన్నాడు. ఆ ఫ్యానే కామినేని శ్రీనివాస్. తాను బీజేపీ అనే విషయాన్ని మరిచిపోయిన వ్యక్తి ఈయన. తెలుగుదేశంలో చంద్రబాబు ప్రాపకం కోసం.. బాబును ఆకట్టుకోవడానికి.. ప్రయత్నించే సగటు లీడర్ల కన్నా చాలా సిల్లీగా వ్యవహరిస్తుంటారు ఈ మంత్రిగారు. ఈయన శాఖ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
అయితే బాబు తరపున వకల్తాపుచ్చుకుని మాత్రం కామినేని ఒక రేంజ్ లో మాట్లాడుతుంటారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో అయినా... జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంలో అయినా.. సగటు పచ్చ చొక్కాల కన్నా రెండాకులు ఎక్కువగానే మేసింది ఈ కాషాయచొక్కా. బాబు క్యాబినెట్ లో మాణిక్యాల రావు వంటి బీజేపీ నేత ఉన్నాడు. ఈయన అవసరమైన సందర్భాల్లో తన ఉనికిని చాటుకుంటున్నాడు. తన శాఖలో వేరే వాళ్లు వేలెడుతున్న సమయంలోనూ..తనకు ప్రాధాన్యత దక్కడం లేదనుకొంటున్న సందర్భాల్లోనూ మాణిక్యాల రావు ఘాటుగానే స్పందిస్తున్నాడు.
అయితే ఆ మాత్రం వెన్నెముక కామినేనికి లేకపోయింది. మరి ఇలా గులాంగిరి చేయడం అనేది వ్యక్తిగతంగా శక్తి లేకపోవడానికి నిదర్శనమా లేక.. ఇదంతా కమ్మదనమేనా! అనేదే సందేహం. 
Editorial Desk
« PREV
NEXT »

No comments

Post a Comment