తాజా వార్తలు

Thursday, 1 October 2015

బాలయ్య కి సిఎం పోస్ట్ తప్ప ఏదీ వద్దు అంటా...???నిన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయడు రెండు తెలుగు రాష్ట్రాలకు పదవులను పంచారు దాంట్లో బాలయ్య కు ఏ పదవి లేకపోవడంతో కొంతమంది మీడియా వాళ్ళు పనిగట్టుకొని బాలయ్య కు పదవి రాలేదని అంటున్నారు కానీ బాలయ్య పదవి కోరుకునే టైపు కాదు ఆయన కోరుకోవాలేగాని రాని పదవి అంటూ ఏముంటుంది చెప్పండి . పాతికేళ్ల క్రితమే నా రాజకీయ వారసుడు బాలయ్య అంటూ స్వర్గీయ ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే . అప్పుడే ఎ పదవి కోరుకోలేదు బాలయ్య ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయాక వచ్చిన ఎన్నికల్లో అసెంబ్లీ కి పోటీ చేసి ఎం ఎల్ ఏ అయినప్పటికీ మంత్రి పదవి కోరుకోలేదు మంత్రి పదవి అడగాలే కానీ బాబు ఇవ్వడా ఏంటి ? అయినప్పటికీ అడిగి తీసుకునే రకం కాదు బాలయ్య ది . ఒకటి ప్రజలు కోరుకోవాలి లేదా బాలయ్య అనుకోవాలి అప్పుడే రంగంలోకి దిగేది అంతేకాని పదవుల కోసం పాకులాడే మనస్తత్వం కాదు బాలయ్యది కాబట్టే మంత్రి పదవి కోసం కానీ ,పార్టీ పదవి కానీ అడగలేదు ,ఏదైనా సరే అది బాలయ్య దగ్గరకు రావాల్సిందే తప్ప బాలయ్య నోరు తెరిచి ,చేయి చాచి అడిగే రకం కాదు . అయితే బాలయ్య అభిమానులు మాత్రం బాలయ్య సిఎం కావాలని ఆశిస్తున్నారు అందుకే బాలయ్య ప్రతీ వేడుకలో కాబోయే సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు . మరి అభిమానుల ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి .
Political Desk
« PREV
NEXT »

No comments

Post a Comment