తాజా వార్తలు

Wednesday, 28 October 2015

బాలయ్య, ఎన్టీఆర్ ఓ సినిమాలో....???కొరటాల శివ డైరక్షన్ లో పట్టుపట్టి మరీ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. మైత్రీ మూవీస్ నిర్మాణం. మిర్చి, శ్రీమంతుడు మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ వుందట. దాన్ని మోహన్ లాల్ తో చేయిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నందమూరి అభిమానులు ఓ సూచన చేస్తున్నారు. మోహన్ లాల్ తో సమానమైన ఫీచర్స్ వున్నవాడు బాలయ్య. సరైన పాత్ర దొరకాలే కానీ చెలరేగిపోతాడు.
పైగా బాలయ్య, ఎన్టీఆర్ ఓ సినిమాలో అంటే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. క్యారెక్టర్ స్టామినా చెప్పి, బాలయ్యను వప్పించగలిగితే, సినిమా సూపర్ గా, జోడీ బంపర్ గా వుంటుదన్నది వాస్తవం. అసలే బాబాయ్ కు అబ్బాయ్ కు రాజీ ప్రయత్నాలు కళ్యాణ్ రామ్ చేస్తున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. 
ఈ విధంగా ఓ సినిమాలో చేసారంటే, ఆటోమెటీక్ ప్యాచప్ అయిపోతుంది..ఇటు తెలుగుదేశం శ్రేణులు, అటు నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు.కానీ ఇలా జరగాలంటే, ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి బాబాయ్ ను వప్పించాల్సి వుంటుంది.
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment