తాజా వార్తలు

Monday, 5 October 2015

ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహావిష్కరణ

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై మరో మహనీయుడి విగ్రహం కొలువుదీరింది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంటకస్వామి (కాకా) విగ్రహాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు.  కాకా విగ్రాహాన్ని ఆవిష్కరించినందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కాకా చేసిన సేవలను కొనియాడారు. వెంకటస్వామి రాజకీయ భీష్ముడు అని కితాబిచ్చారు. సుధీర్ఘ రాజకీయ చరిత్ర, అపారమైన అనుభవం ఉన్న నిజమైన తెలంగాణ బిడ్డ అని తెలిపారు. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాకా ఆస్పత్రిలో ఉన్నపుడు తాను వెళ్లి కలిశానని అప్పుడు వెంకటస్వామి తనకు తెలంగాణ వచ్చిన తర్వాత చూసే కన్ను మూయాలని ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. చివరికి తెలంగాణను చూశాకే స్వర్గస్థుడయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ మధుసూధనాచారి, కేంద్ర మంత్రి బండారు దత్రాత్రేయ, కాకా కుమారులు వినోద్, వివేక్‌తోపాటు పలువురు కాకా అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలను జరిపారు. 

« PREV
NEXT »

No comments

Post a Comment