తాజా వార్తలు

Saturday, 31 October 2015

చంద్రబాబు వ్యవసాయ రంగంపై శ్రద్ధలేదు- బొత్స

వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు  రైతులు, వ్యవసాయంపై శ్రద్ధ లేదన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించడంపై చంద్రబాబు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యవసాయాన్ని ఆదుకోవాలన్ని తలంపు  ఏమాత్రం లేదని విమర్శించారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయం రంగం సంక్షోభంలో పడిందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. వరికి 1450 రూపాయల కనీస మద్దతు ధర సరిపోదని.. రైతులకు  క్వింటాల్కు 200 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని రాజధాని పేరుతో లాక్కొని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు.
« PREV
NEXT »

No comments

Post a Comment