తాజా వార్తలు

Friday, 16 October 2015

బ్రూస్ లీ రివ్యూ

రామ్ చరణ్ మరోసారి ఫ్యామిలీ డ్రామానే నమ్ముకొని చేసిన సినిమా బ్రూస్ లీ చేశాడు. దీంతో రొటీన్ కథ కథనాలకు కొత్త సాంకేతిక జోడించి తెరకెక్కించిన సినిమా బ్రూస్ లీ. క్వాలిటీ పరంగా మెప్పించినా, అభిమానులు ఆశించిన స్ధాయి సినిమాగా అలరించలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో కీలకమైన ట్విస్ట్ ను ఫస్టాఫ్ లోనే రివీల్ చేయటంతో సెకాండఫ్ ఇంట్రస్టింగ్ గా అనిపించదు. ఇక కామెడీతో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కొన్ని పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోవటం కూడా సినిమాకు మైనస్. ఫస్టాఫ్ మాస్ ఆడియన్స్ ను మెప్పించటంతో పాటు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగా రావటంతో ఆడియన్స్ కాస్త సంతృప్తి పడతారు. మరోవైపు మెగా అభిమానులకు నచ్చే మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న ఈ సినిమా సక్సెస్ మీద చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  

కథలోకి వెళితే..
చిన్నప్పటి నుంచి బ్రూస్ లీ యాక్షన్ చూసి ఆకర్షితుడైన రామ్ చరణ్ (కార్తీక్ ) తన పేరును కూడా బ్రూస్ లీగా మార్చేసుకుంటాడు. కార్తీక్ ది అందమైన కుటుంబం అమ్మ (పవిత్ర లోకేష్), నాన్న రామచంద్రరావు (రావు రమేష్), అక్క (కృతి కర్బందా). కార్తీక్ తండ్రి, జయరాజ్ (సంపత్), వసుంధర (నదియా)కు చెందిన వసుంధర ల్యాబ్స్ లో పనిచేస్తుంటాడు. అదే సమయంలో కార్తీక్ కూడా స్టంట్ మాస్టర్ గా పనిచేస్తూ తండ్రికి సహాయపడుతుంటాడు. వీడియో గేమ్ డెవలపర్ రియా (రకుల్ ప్రీత్ సింగ్)కు పోలీస్ నే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అదే సమయంలో కార్తీక్ ను చూసిన రియా తొలిచూపులోనే ఇష్టపడుతుంది. కార్తీక్ నే హీరోగా పెట్టి ఓ గేమ్ డెవలప్ చేస్తుంది. అదే సమయంలో పోలీస్ నే పెళ్లి చేసుకోవాలనే తన పిచ్చి వల్ల అనుకోని సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి రియాను కాపాడాలనుకున్న కార్తీక్... దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) గ్యాంగ్ తో గొడవ పడతాడు. వసుంధర ల్యాబ్స్ లో పనిచేస్తున్న రామచంద్రరావు కూతురు కృతిని ఆ కంపెనీ ఓనర్ జయరాజ్ తన కోడలిగా చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో జయరాజ్ కు సంబందించి కొన్ని నిజాలు బయటికి వస్తాయి. ఒకేసారి జయరాజ్, దీపక్ రాజ్ ల నుంచి కార్తీక్ కుటుంబానికి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యల నుంచి కార్తీక్ అలియాస్ బ్రూస్ లీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, అసలు విలన్లతో బ్రూస్ లీకి ఉన్న శతృత్వం ఏంటి. అన్నది స్క్రీన్ మీదే చూడాలి 
« PREV
NEXT »

No comments

Post a Comment