తాజా వార్తలు

Monday, 12 October 2015

సర్దార్ షూటింగ్ స్పాట్లో చరణ్...!రామ్ చరణ్ కు బాబాయ్ పవన్ తో వున్న బంధం ఇలాంటిది అలాంటిది కాదు. అందుకే ఆ బాబాయ్, ఈ అబ్బాయ్ తో సినిమా కూడా ఫ్రకటించారు. అది వచ్చే ఏడాది నుంచి సెట్ పైకి వెళ్తుంది. ఇదిలా వుండగా జస్ట్ కాజువల్ గా రామ్ చరణ్ తన బాబాయ్ లేటేస్ట్ ఫిల్మ్ సర్దార్ షూటింగ్ స్పాట్ కు శనివారం వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ బాబాయ్ తో కాస్సేపు ముచ్చటించి వచ్చినట్లు బోగట్టా. బ్రూస్ లీ సంగతులు, సురేందర్ రెడ్డి డైరక్షన్ లో థని ఒరువన్ రీమేక్ వివరాలు బాబాయ్ తో పంచుకున్నాడట.
తను త్వరలో స్టార్ట్ చేయబోయే కొణిదెల ప్రొడక్షన్స్, వైట్ హార్స్ ప్రొడక్షన్స్ వివరాలు అందించాడట. అలాగే సర్దార్ పాట షూటింగ్ ను కాస్సేపు తిలకించాడట. పవన్ కూడా వచ్చే ఏడాదిలో చరణ్ సినిమా ప్రారంభిద్దామని, డేట్లు చూసుకోమని చెప్పాడని వినికిడి.
మొత్తానికి బాబాయ్, అబ్బాయ్ ల అనుబంధం గట్టిది అని మెగాభిమానులకు చాటిచెప్పడానికి ఈ విజిట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే, మొన్నటి బ్రూస్ లీ అడియో ఫంక్షన్ కు పవన్ అభిమానులు రాకుండా చాలా జాగ్రత్త పడినట్లు గుసగుసలు వినిపించాయి కదా.

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment