తాజా వార్తలు

Monday, 5 October 2015

దిల్ రాజుకు ఎక్కడో సుడి వుంది.......!అక్టోబర్ 2న పులి, శివమ్ లాంటి రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి..సుబ్రహ్మణ్యం సేల్స్ డల్ అవుతాయి అనుకున్నారు..ఆ సినిమాకు సంబంధించిన వాళ్లు కూడా కాస్త అలాగే భయపడ్డారు. కానీ దిల్ రాజుకు ఎక్కడో సుడి వుంది. వచ్చిన రెండు సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.
శివమ్ సినిమా టాక్ ఎంత వేగంగా ఎలా స్ప్రెడ్ అయిందో కానీ, శనివారం మార్నింగ్ షో టైమ్ కే కలెక్షన్లు ధడేల్న పడిపోయాయి. పులి కాస్త ఆలస్యంగా విడుదల కావడంతో, శని, ఆదివారాలు ఫరావాలేదనిపించుకుంది. కానీ ఆ సినిమా కూడా సోమవారం నీరుగారిపోయింది. చాలా మల్టీ ఫ్లెక్స్ ల్లో పట్టుమని పది టికెట్ లు తెగలేదు.
దీంతో సోమవారం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కలెక్షన్లు బాగున్నాయి. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆదివారం కొన్ని థియేటర్లు ఫుల్స్ ను కూడా చూసాయి. సోమవారం కూడా స్టడీగానే వుంది.

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment