తాజా వార్తలు

Tuesday, 27 October 2015

హుషారెత్తించిన సంగీత్ కార్యక్రమంభిన్న పార్టీలకు చెందిన నేతలు కలవటం ఒక ఎత్తు అయితే.. వేర్వేరు ప్రాంతాలకు చెందిన నేతల మధ్య బంధం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. వారి మధ్య అనుబంధం చూస్తే ముచ్చటేయక మానదు. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణ తెలిసిందే. ఇక.. నేతల మధ్య కూడా అందుకు భిన్నమైన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేర్వేరు పార్టీలకు.. ప్రాంతాలకు చెందిన నేతలు ఒకచోట కలవటమే కాదు.. ఖుషీ.. ఖుషీగా వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది.

ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు నారాయణ.. గంటా శ్రీనివాసులు వియ్యంకులు కావటం తెలిసిందే. గంటా కొడుక్కి.. నారాయణ కూతురితో ఈ నెల 30న పెళ్లి జరగనుంది. దీనికి సంబంధించిన సంగీత్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ..పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మాజీ మంత్రి.. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడైన దానం నాగేందర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. హిందీ హిట్ పాటలకు దానం కాలు కదిపి స్టెప్పులు వేయటం.. ఆయన్ను ఉత్సాహపరిచేందుకు వియ్యంకులిద్దరూ రంగంలోకి దిగి.. చప్పట్లతో ప్రోత్సహించటం లాంటి విశేషాలు ఈ సంగీత్ లో చోటు చేసుకున్నాయి.

దానం హుషారు చూసిన ఏపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ సైతం ఆగలేకపోయారు. ఆయన కూడా లేచి.. స్టెప్పులు వేయటం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. మొత్తంగా ప్రాంతాలకు.. పార్టీలకు అతీతంగా నేతలు కలిసి హుషారుగా స్టెప్పులు వేయటం పలువురిని ఆకట్టుకుంది. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా చక్కటి సంబంధాలు ఉండటం మంచి పరిణామమే.
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment