తాజా వార్తలు

Thursday, 1 October 2015

గోద్రేజ్ డీల్ రూ.1479 కోట్లు....!
ఖరీదైన భవనాల అమ్మకాలు భారత్ లో ఉపందుకున్నాయి. తాజాగా అలాంటిదే ఒక రియల్ డీల్ ముంబయిలో జరిగింది. ప్రఖ్యాత కంపెనీ గోద్రేజ్ కు చెందిన భవనంలోని కొంత విస్తీర్ణాన్ని రూ.1479 కోట్లకు అమ్మేశారు. రియల్ వర్గాలతో పాటు.. వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారిన ఈ డీల్ భారత్ లోని అతి పెద్ద ‘రియల్ డీల్’గా అభివర్ణిస్తున్నారు.

బాంద్రా.. కుర్లాలో గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ 19 అంతస్తులలో 13లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 4.35లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గోద్రోజ్ ప్రాపర్టీస్ సంస్థ తాజా అమ్మింది. 2016 జూన్ నాటికి ఈ భవన నిర్మాణం పూర్తి అవుతుందని భావిస్తున్నారు. ఈ బహుళ అంతస్థుల భవనంలో చదరపు అడుగు రూ.39వేలు చొప్పున అమ్మటం విశేషం.

మొత్తం విస్తీర్ణంలో 30 శాతాన్ని కొనుగోలు చేసిన అబ్బాట్.. వివిధ ప్రాంతాల్లో ఉన్న తన కార్యాలయాల్ని ఒకే చోటుకు తీసుకురావాలని భావిస్తోంది. దీంతో పాటు.. తన సంస్థకు చెందిన 1500 మందికి నివాస సౌకర్యాన్ని కల్పించాలనుకోవటం గమనార్హం. ఇప్పుడే ఇంత భారీ మొత్తానికి గోద్రెజ్ సంస్థ అమ్మితే.. ఈ భవనంలోని మిగిలిన భాగాన్ని ఏ ధరకు అమ్ముతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
National Desk
« PREV
NEXT »

No comments

Post a Comment