తాజా వార్తలు

Friday, 30 October 2015

హెయిర్‌ కలర్‌ టిప్స్‌మీకు ఇంతకముందు నుంచే హెయిర్‌ కలర్‌ వేసుకొనే అలవాటుందా... లేదా ఇప్పుడు కొత్తగా వేసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.
జుట్టుకి రంగు వేసుకోవాలనుకుంటే స్కిన్‌ టోన్‌కి సరిపడే హెయిర్‌ కలర్‌ని ఎంచుకోవాలి. వీటిల్లో వామ్‌కలర్స్‌, కూల్‌ కలర్స్‌ అని రెండు రకాలుంటాయి. ఎల్లో, డార్క్‌ ఆరెంజ్‌, కాపర్‌, బ్రిక్‌ కలర్స్‌ వంటివి వామ్‌ కలర్స్‌లోకి వస్తాయి. అలాగే బ్లూ, గ్రీన్‌, పింక్‌ వంటివి కూల్‌ కలర్స్‌ జాబితాలోకి వస్తాయి. వామ్‌ హెయిర్‌ కలర్స్‌ వేసుకున్నవారు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా నిపుణుల్ని సంప్రదించాలి. ఎందుకంటే వాటివల్ల జుట్టుకు డామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. జుట్టు బలంగా అవడానికి కలర్‌ వేసుకోవడానికి వారం ముందే కండీషనర్‌ వాడాలి. ఒకవేళ జుట్టుకు రంగు వేసుకోవడం ఇదే మొదటిసారైతే నలుపుకు దగ్గరగా ఉండే బ్రౌన్‌ కలర్‌ వేసుకోవడం మంచిది. కొంతమంది రెడ్‌కలర్‌ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఆరు వారాలలోపే ఆ కలర్‌ షైనింగ్‌ తగ్గిపోతుంది. అందువల్ల రీ కలరింగ్‌ చేయాల్సి వస్తుంది. దానివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా కనిపిస్తుంది.
Health Desk
« PREV
NEXT »

No comments

Post a Comment