తాజా వార్తలు

Friday, 2 October 2015

జాకీచాన్‌తో ఇలియానా నటిస్తుందనమాట...!
యాక్షన్ సూపర్‌స్టార్ జాకీచాన్‌తో ఇలియానా నటిస్తుందన్న వార్త బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. జాకీ చాన్ లేటేస్ట్ మూవీ ‘కుంగ్ ఫూ యోగా’ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్-చైనా
సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్ సరసన హీరోయిన్‌గా నటించడానికి ఇలియానాను తీసుకున్నారని సమాచారం. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఓ కీలక పాత్ర కోసం సోనూ సూద్‌ను ఎంపిక చేశారు.ఈ మూవీలో కొన్ని కీలకపాత్రలకు అమీర్ ఖాన్ , హృతిక్ రోషన్ ,కత్రినా కైఫ్ లను తీసుకోవాలనుకున్నారట..అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అదీ
కుదర్లేదు.కత్రినా కైఫ్‌ని అనుకున్న పాత్రకు మాత్రం ఇలియానాని తీసుకున్నారని తెలుస్తోంది.గతంలో ‘ద మిత్’ చిత్రంలో జాకీచాన్‌ సరసన మల్లికా శెరావత్ నటించింది.ఒకవేళ ఇలీయానా జాకీ సరసన నటిస్తే
.ఆయన ప్రక్కన నటించిన రెండో భారతీయ నటి ఇలియానానే అవుతుంది.
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment