తాజా వార్తలు

Saturday, 10 October 2015

జగన్ దీక్షకు దేశవిదేశాల నుంచి వెళ్లువెత్తున్న మద్దతు

వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ కు మాతృమూర్తి వైఎస్ విజయమ్మ దీవెనలు అందించారు. నేటి ఉదయం గుంటూరు నల్లపాడు రోడ్డులోని వైఎస్ జగన్ దీక్షా స్థలికి వైఎస్ విజయమ్మ చేరుకున్నారు.  వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీక్ష విజయవతం కావాలని విజయమ్మ వైఎస్ జగన్ ను ఆశీర్వదించారు.  రోజురోజుకు వైఎస్ జగన్ ఆరోగ్యం నీరసిస్తుండడంతో విజయమ్మ ఆందోళన చెందుతున్నారు.  జగన్ బాగా నీరసించారని, గంటగంటకు పల్స్ రేటు పడిపోతుందని వైద్యులు తెలిపడంతో విజయమ్మ కలవరపడుతున్నారు.  వైఎస్ జగన్ వెన్నంటే విజయమ్మ కూర్చొన్నారు.  ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. రాష్ట్ర ప్రజానీకమంతా వైఎస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు తండోపతండాలుగా నల్లపాడు రోడ్డుకు తరలివస్తున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ వైఎస్ జగన్ కు  మద్దతు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ తో గుంటూరులోని నల్లపాడులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు చెప్పట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపేందుకు UAE లోని YSRCP అభిమానులు దుబాయ్ లోని సోనాపూర్ ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. UAE లోని YSRCP అభిమానులు మరియు ప్రతినిధులు పాల్గొని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి సంఘీభావం తెలియజేశారు. దూరప్రాంతాల నుండి రాలేని వారు మరియు డ్యూటీ లో ఉన్నవారు, ఫోన్ మరియు ఇతర సామాజిక  మాధ్యమాల  ద్వారా వారి సంఘీభావం తెలియజేశారు. సమావేశంలో పలువురు అభిమానులు మాట్లాడి, ప్రత్యేక హోదా యొక్క ఉపయోగాలు వివరించారు. మరికొందరు మాట్లాడుతూ, ఓటుకు కోట్లు కేసుల్లో ఇరుక్కున చంద్రబాబు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వత్తిడి తీసుకురావడం లేదని, స్వప్రయోజనాల కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టుపెడుతున్నారని వారంతా దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వస్తే, వారు దుబాయ్ కి వలస రానవసరం లేకుండా, ఆంధ్రాలోనే ఉద్యోగ మరియు ఉపాది అవకాశాలు మెరుగుపడతాయని అబిప్రాయపడ్డారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment