తాజా వార్తలు

Monday, 5 October 2015

విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఎయిర్ పోర్టు బాధితుల్ని ఆయన పలకరించనున్నారు. ఈ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జగన్ మహారాజు పేట కు చేరుకొంటారు. అక్కడ జిల్లా పార్టీ నాయకులు వైఎస్ జగన్ కు స్వాగతం పలకనున్నారు. తర్వాత ఎ రావివలస లో రిలే నిరాహార దీక్ష శిబిరం దగ్గరకు చేరుకొంటారు. అక్కడ వారితో జగన్ మాట్లాడతు. తర్వాత గూడెపువలస కు చేరుకొని అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం కవుల వాడకు చేరుకొని అక్కడ బాధితులతో మాట్లాడతారు.   
« PREV
NEXT »

No comments

Post a Comment