తాజా వార్తలు

Thursday, 22 October 2015

ప్రత్యేకహోదా విషయంలో జగన్ అనుమానమే నిజం అయ్యింది...



ఐదు కాదు.. పది, పదేహేనేళ్లు ఏపీకి ప్రత్యేకహోదాను ఇవ్వాలి.. అనేది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందునాడు మాట్లాడిన మాట. అయితే ఇప్పుడు ఆ పార్టీ లెక్కలు మారాయి. ఏపీకి ప్రత్యేకహోదాను ఇవ్వడం వల్ల తమకు రాజకీయంగా ఒరిగేది లేదని ఆ పార్టీ ఫీలవుతోంది. అందుకు ఫిక్సయ్యింది. అందుకే ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది.జగన్ ముందునుండి చెప్తునే వున్నాడు ఇలా జరుగుతుంది అని....
ఆ ఫిరాయింపుపై విమర్శలు వస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు కమలనాథులు.తమను విమర్శించే అర్హత ఎవరికీ లేదని తేల్చేశారు. మరి అలా బుకాయించేస్తే చాలదు కదా! ఇంకా ఏదో చేయాలి. అలా చేస్తేనే "ప్రత్యేకహోదా'' ఉచ్చు నుంచి తాము సులభంగా తప్పించుకోగలరు. ప్రత్యేకహోదా విషయంలో తాము ఇచ్చిన హామీలను జనాలు మరిచిపోలేదని మాత్రం స్పష్టం అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హోదా లేదు... ప్యాకేజీ అని కుండబద్ధలు కొట్టేసినా.. ఒక ప్యాకేజీ ప్రకటించేసి... వ్యవహారానికి ఒక ముగింపుని ఇచ్చినా ఇబ్బందులు పడేది భారతీయ జనతా పార్టీనే! రకరకాల లెక్కలన్నీ వేసి.. లక్ష కోట్ల రూపాయల స్థాయి ప్యాకేజీని ప్రకటించినా... ఎవ్వరూ ప్రశంసించకపోగా.. హోదాను లేకుండా చేస్తున్నారనే మిష మీద విమర్శలే ఎక్కువ వస్తాయి!
భారతీయ జనతా పార్టీ చేసిన మోసమే హైలెట్ అవుతుంది. పార్లమెంటు సాక్షిగా.. భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేసి.. ఇప్పుడు మాట తప్పారనే అపప్రద శాశ్వతంగా మిగిలిపోతుంది.
అందుకే.. కమలనాథులు కూడా తమ తెలివి తేటలు కనబరుస్తున్నారు. రాష్ట్ర విభజన అంశం గురించి నాలుగైదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి గేమ్ ఆడిందో..అంతిమంగా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణమైన నిర్ణయాన్ని ఎలా తీసుకుందో.. ఇప్పుడు బీజేపీ కూడా ప్రత్యేకహోదా- ప్యాకేజీ అంశం గురించి అలాంటి గేమ్ నే ఆడుతోంది!
జనాలను కొత్త ట్రాన్స్ లోకి తీసుకెళ్లడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ప్యాకేజీ ఎవరికి కావాలి? ప్రత్యేక హోదా కావాలి.. అనేది తెలుగుదేశం, బీజేపీలపై ప్రత్యేకాభిమానం లేదని ఆంధ్రుల మాట. అయితే ఇప్పుడు వాళ్లే "ప్యాకేజీ కూడా లేదా?'' అని ఆశ్చర్యపోతున్నారు!
ఇలాంటి ప్రజలు రేపటి నుంచి "ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే బాగుండు...'' అనే మెంటల్ స్టేటస్ లోకి జారిపోవాలి. చివరకు ఏదో ఒక ప్యాకేజీ ప్రకటిస్తే.. "హమ్మయ్యా.. ప్యాకేజీ ప్రకటించారు చాల్లే..'' అనుకోవాలి. ప్రత్యేకహోదాను ఆ విధంగా మరిచిపోవాలి. అందుకే ఇప్పుడు  ప్యాకేజీ విషయంలో కూడా గేమ్ ఆడుతున్నారు. సులభంగా ప్రకటించేస్తే.. అది చీప్ అవుతుందని, దాని వల్ల తాము చెడ్డవాళ్లమవుతాము తప్ప.. మరో ఉపయోగం లేని కమలనాథులు భావిస్తున్నారు.
అందులో భాగంగా ప్యాకేజీ దక్కడం కూడా కష్టమే అనే ఇండికేషన్లను పంపుతున్నారు. జనాలను ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్లి.. చివరకు ఏ ఎన్నికల సమయంలోనో.. ఒక ప్యాకేజీని ప్రకటించి..నెక్ట్స్ టైమ్ మోడీ-బాబు జోడీ గెలిస్తే.. ఆ ప్యాకేజీ దక్కుతుంది అనే హామీని ఇచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలు సాగుతున్నాయి.
అప్పటికి రాజెవరో..రౌతెవ్వరో! ఈ ఆటలో ఏపీ జనాలను పావులుగా చేస్తున్నారు. అచ్చంగా మరో మోసానికి నిన్నటితో తెరతీశారనేని నిష్టూరమైన నిజం. విభజనతో కాంగ్రెస్ ఏపీని ఒకలా మోసం చేస్తే.. బీజేపీ, తెలుగుదేశం ద్వయం మరో మోసానికి పూనుకొంది. మరి సీమాంధ్ర జనాలు ఎన్నిసార్లు ఇలా.. ఎన్ని కూటముల చేతిలో మోసపోవాలి? అనేదే శేష ప్రశ్న. 
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment