తాజా వార్తలు

Tuesday, 6 October 2015

జ‌గ‌న్‌ ను బెదిరించిన లోకేష్....!పార్టీ ప‌ద‌వి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారిగా పార్టీ త‌ర‌పున  మాట్లాడిన ఎపి ముఖ్య‌మంత్రి త‌న‌యుడు లోకేష్‌... ప‌ద‌వీకాలం ప్రారంభంలోనే బెదిరింపుల‌కు దిగాడు. ప్ర‌తిప‌క్ష‌నేత ల‌క్ష్యంగా సాగిన ఆయ‌న బెదిరింపుల ప‌ర్వం రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను సైతం విస్మ‌యానికి గురిచేసేలా ఉంది.
ఇప్పుడిప్పుడే రాజ‌కీయాభ్యాసం చేస్తున్న లోకేష్ , ఎపి ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ ప్ర‌త్యేక‌హోదా కావాల‌ని కోరుతూ చేస్తున్న దీక్ష‌పై చేసిన వ్యాఖ్య‌లు లోకేష్ రాజ‌కీయ ప‌రిణితి లోపాన్ని ఎత్తి చూపుతున్నాయని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రారంభం కానున్న జ‌గ‌న్ దీక్ష‌ను పుర‌స్క‌రించుకుని లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల సారాంశం ఏమిటంటే... హోదా అని అద‌నీ పోరాటాల‌కు పంతాల‌కు పోతే, కేంద్రంతో వివాదాలు పెట్టుకుంటే వ‌చ్చే నిధులు కూడా రావంట‌. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఎపిపై ఎంతో క‌రుణ చూపించి, దాదాపు రూ.13వేల కోట్ల‌కు పైగానే నిధులు ఉదారంగా ఇచ్చేసింద‌ట‌. ఇంత గొప్ప‌గా కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆదుకుంటున్న‌ప్పుడు ఇక హోదాలు అవీ అంటూ పోరాటాలు ఎందుకనేది లోకేష్ బాబు ఉధ్ధ్యేశ్యం కావ‌చ్చు.
ఇక్క‌డ చిన‌బాబు ఆలోచించాల్సిందేమిటంటే... కేంద్రం మ‌న‌కు ఏమి ఇచ్చినా అవి రాష్ట్రాల స్థితిగ‌తుల ప్ర‌కారం,  న్యాయంగా రావ‌ల్సిన‌వే త‌ప్ప జాలితో వేసే బిచ్చం కాద‌ని. మ‌న రాష్ట్ర ప‌రిస్థితి ప్ర‌కారం మ‌న‌కు కేంద్రం అందించాల్సిన సాయాన్నిత‌గిన విధంగా అడిగి సాధించుకోవాలి. అంతే త‌ప్ప దిగ‌జారి కాదు. మ‌న‌కు ఇచ్చిన హామీల ప్ర‌కారం ప్ర‌త్యేక హోదా రూపంలో ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాల‌ను త్యాగం చేసేసి ఇంకేదో వ‌చ్చిందంటూ పొంగిపోవ‌డం వ‌ల్ల అద‌నంగా ఒరిగేది ఏముంటుంది?
ఇక జ‌గ‌న్‌ను ప్ర‌త్య‌క్షంగా లక్ష్యం చేసుకుని లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల్లో తీవ్ర‌మైన అభ్యంతరం వ్య‌క్తం చేయ‌ద‌గింది... దీక్షా సమ‌యంలో ఏవైనా అల్ల‌ర్లు జ‌రిగితే... జ‌గ‌న్‌పై కేసులు పెడ‌తామంటూ ప‌రోక్షంగా హెచ్చ‌రించ‌డం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్‌పై కేసులు పెట్టేవ‌ర‌కూ పోరాడ‌తారంటూ కార్య‌క‌ర్త‌లు ఏం చేయాలో దిశా నిర్ధేశ్యం కూడా చేసేశాడు. ఇప్ప‌టిదాకా లేని విచిత్ర‌మైన దుఃస్సంప్ర‌దాయం ఇది. దేశ చ‌రిత్ర‌లోనే నిర‌స‌న‌దీక్ష‌కు దిగిన ఒక పార్టీ నేత‌ను ఇలా హెచ్చ‌రించిన అధికార పార్టీ లేద‌ని చెప్పాలి.
కొత్తగా ప‌ద‌వొచ్చినోడు పొద్దెర‌గ‌డ‌న్న‌ట్టుగా త‌న మాట‌లు ఉన్న విష‌యాన్ని లోకేష్ గుర్తించాలి. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న‌ల‌ను ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎదుర్కోవాలే త‌ప్ప అధికారాన్ని ఉప‌యోగించి అణిచేస్తామ‌నే బెదిరింపులు చెల్ల‌వ‌ని తెలుసుకోవాలి.
News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment