తాజా వార్తలు

Thursday, 15 October 2015

జగన్‌ ప్రశ్నలతో బాబు కి కలవరం...


'అవునా అమరావతి ప్రాంతంలో అంత ఘోరం జరుగుతున్నదా..? అక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా.. ? అదేమైన మతఘర్షణలు చెలరేగుతున్న ఉద్రిక్త ప్రాంతంలాగా ముద్ర పడినట్లు పోలీసులు అక్కడ అంత దాష్టీకంగా వ్యవహరిస్తున్నారా? ఇవేవీ మనకు తెలియదే...! అమరావతి పేరు పెట్టి ప్రజలను అణచివేసేలా సర్కారు తన ఇనుప పాదాలతో ఇన్నేసి ఘోరాలు చేస్తోంటే ఏ ఒక్కటీ వెలుగులోకి రాలేదు ఎందుకు చెప్మా?'' అని తెలుగునాట ప్రజల ఇవాళ నివ్వెరపోతున్నారు. అంతో ఇంతో అక్షరజ్ఞానం ఉండి, రోజూ రాజకీయాలు పరిణామాలు ఫాలో అయ్యే వారు కూడా.. తమకు తెలియదనే తెలియదే అని నివ్వెరపోతున్నారు. 
జగన్‌ తాను కార్యక్రమానికి రాబోవడం లేదంటూ.. నిర్ధరించి, ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు. అందులో 8 ప్రశ్నలను సంధించారు! భూములు లాక్కోవడం, ఇంకా ఇవ్వని వారి సంగతేంటో తేలకపోవడం, ఈ భూములిన విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడం, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అభ్యంతరాలను తుంగలో తొక్కి.. దూసుకెళ్లడం, సొంతవారి లబ్ధి , డబ్బు వృథా ఇవన్నీ అందులో ఉన్నాయి. వీటిలో కొన్ని రాజకీయ పరమైన ఆరోపణలు అని కూడా తోసిపుచ్చవచ్చు. 
కానీ ఒక కీలకమైన ఆరోపణ ఉంది. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 లను ఎందుకు అమలు చేస్తున్నారు? ప్రజలు ఆనందంగా ప్రభుత్వానికి సహకరించారన్నది నిజమే అయితే గనుక.. ఈ సెక్షన్లు సంవత్సరం నుంచి ఎందుకు అమల్లో ఉన్నాయి అంటూ జగన్‌ ప్రశ్నించారు. నిజానికి అక్కడ ఆ సెక్షన్లు అమల్లో పెట్టినట్లు, తద్వారా అక్కడి జనజీవితాలను పోలీసు నిఘానేత్రం కింద ఉంచినట్లు జగన్‌ ప్రశ్న ద్వారా మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలిసింది. 
నిజానికి ఇది చాలా దారుణం. పౌరుల హక్కులను హరించి వేయడం లాంటిది. మిగిలిన ఆరోపణలన్నిటినీ రాజకీయ ఆరోపణలు అని సర్కారు కొట్టిపారేసినా.. ఇలా జనంతో ఆడుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? అసలు ప్రజల స్వేచ్ఛ పట్ల ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించగలుగుతోంది? ఇలాంటి సందేహాలు పలువురికి కలుగుతున్నాయి. తెదేపా మరియు అమరావతి సానుభూతి పరులారా.. ఏదైనా జవాబు సిద్ధంగా ఉన్నదా? 
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment