తాజా వార్తలు

Saturday, 31 October 2015

బీసీలకు కళ్యాణ లక్ష్మి - సీఎం కేసీఆర్

వచ్చే యేడాది నుంచి పెళ్లీడుకొచ్చిన బీసీ యువతులకు కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ యేడాది 60 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కట్టిస్తామని తెలిపామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు. గతంలో ఏదో ఎన్నికల కోసం ఇండ్ల నిర్మాణం చేపట్టే వారని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలా చేయబోదని స్పష్టం చేశారు. తక్కువ ఇండ్లు కట్టినా పేదలకు న్యాయం జరిగేలా ఇళ్ల నిర్మాణం ఉంటుందని వివరించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి తండాలన్ని గ్రామ పంచాయతీలు అవుతాయని పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సీఎన్‌ఎన్ ఐబీఎన్ ఛానెల్ కూడా తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణభవన్‌లో వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు ప్రభుత్వం రూ.1000, రూ.1500 ఇస్తోన్న పథకం దేశంలోనే చాలా గొప్ప పథకమని తెలిపారు. సన్న బియ్యం మేనిఫెస్టోలో పెట్టకన్నా పెద్ద మనుసుతో ఇస్తున్నామని తెలిపారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రూ.45 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టామని రెండున్నరేళ్లలో ప్రతీ ఇంటికి మంచినీటిని అందిస్తామని తెలిపారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment