తాజా వార్తలు

Friday, 2 October 2015

నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్న విశ్వ విఖ్యాత నటుడువిశ్వ విఖ్యాత నటుడు కమల్ హాసన్ నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడు. భారీ మొత్తంలో విరాళం అందజేసి మానవత్వం చాటుకున్నారు. హెచ్ ఐవీ బాధితుల సహాయార్థం పనిచేస్తున్న పీటీపీ సంస్థకు కమల్ 16 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు.2011లో స్థాపించబడ్డ పీటీపీ సంస్థ  హెచ్ ఐవీ తో బాధపడుతున్న చిన్నారులకు వైద్య బీమా అందిస్తోంది. కమల్ హాసన్, హల్లో ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్ భాగస్వామ్యంతో ఈ సంస్థను నడుపుతున్నారు. హెచ్ ఐవీ భాదితులకు భారీ విరాళం అందజేయడంతో  ఆయన అభిమానులు హార్షం వ్యక్తం చేస్తున్నారు...!

National Desk
« PREV
NEXT »

No comments

Post a Comment