తాజా వార్తలు

Monday, 5 October 2015

లిప్‌లాక్ కు నో అంటోంద‌ట‌ క‌రీనా ....?

బాలీవుడ్ సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ అనేవి ఇప్పుడు కాదు ఎప్పుడో కామ‌న్ అయిపోయాయి. హాలీవుడ్‌లో నైనా లిప్‌లాక్ లేని సినిమా ఉంటుందేమో కాని ప్రస్తుతం రిలీజ‌వుతున్న హిందీ సినిమాల్లో అవి లేకుండా అంటే భూత‌ద్దం పట్టుకు వెత‌కాల్సిందే. అలాంటి సినిమాల్లో న‌టిస్తూ టాప్ హీరోయిన్లలో ఓ హీరోయిన్‌... ఇప్పుడు లిప్‌లాక్ సీన్లకు స‌సేమిరా అంటోంద‌ట‌.
ఆ హీరోయిన్ పేరు క‌రీనాక‌పూర్‌. బాలీవుడ్ వ‌ర్గాలు, అభిమానులు ముద్దుగా బెబో అని పిలుచుకునే ఈ మిడిల్ ఏజ్డ్ బ్యూటీ తాజాగా తాను న‌టిస్తున్న "కీ అండ్ కా" అనే హిందీ సినిమాలో హీరోతో పెదాలు ముడివేసే స‌న్నివేశాల‌కు నో అని చెప్పింద‌ట‌. అంతేకాదు మితిమీరిన శృంగార‌భ‌రిత స‌న్నివేశాల్లోనూ న‌టించ‌న‌ని చెప్పేస్తోంద‌ట‌.
దీంతో ఆ సినిమా నిర్మాత‌ త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ట‌. క‌రీనా నుంచి ఈ ప‌రిస్థితిని ఊహించ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఎందుకంటే గ‌తంలో క‌రీనా చేసిన ప‌లు సినిమాల్లో అలాంటి సీన్లను రెచ్చిపోయి చేసి ర‌క్తి క‌ట్టించింది. అయితే ఇప్పుడు ఒకేసారి ఇంత‌గా మారిపోవ‌డానికి కార‌ణ‌మేంట‌ని ఆరా తీస్తే... సైఫ్‌తో పెళ్లే కార‌ణం అని తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం సైఫ్‌ను పెళ్లాడిన బెబో... అప్పటి నుంచి ఈ త‌ర‌హా సీన్ల విషయంలో నిర్మాత‌ల‌ను స‌తాయిస్తోంద‌ట‌. మ‌రోవైపు కీ అండ్ కా సినిమా హీరో అర్జున్ క‌పూర్ త‌న క‌న్నా వ‌య‌సులో బాగా చిన్నవాడు కావ‌డం కూడా క‌రీనా... వెనుక‌డుగుకు మ‌రో కార‌ణం అంటున్నారు. ఈ నేప‌ధ్యంలో వీరిద్దరి మ‌ధ్యా హాట్ సీన్లు వ‌ద్దని నిర్మాత నిర్ణయించుకుంటాడా?  లేక ఏదోలా క‌రీనాను క‌న్విన్స్ చేస్తాడో మ‌రి...ఏదేమైనా... సినిమా హీరోయిన్లు త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు పంధాలు మార్చేసుకుంటే నిర్మాత‌ల‌కు పాపం క‌ష్టాలే.
Film Desk-Bollywood
« PREV
NEXT »

No comments

Post a Comment