తాజా వార్తలు

Sunday, 4 October 2015

బాత్ రూంలో ఆస్కార్ అవార్డును దాచేసిన క్రేజీ హీరోయిన్

 టైటానిక్ భామ కేట్ విన్ స్లెట్.. ఆస్కార్ అవార్డును బాత్ రూంలో పెట్టేసింది. పైగా అవార్డు మీద ఓ ప్లాస్టిక్ కవర్ కప్పేసింది.
అయితే, ఆస్కార్ అవార్డుని తాను బాత్ రూంలో ఊర్కే పెట్టలేదట. దానికీ ఓ రీజన్ ఉందని సెలవిస్తోంది కేట్. 2009లో విడుదలైన ‘ది రీడర్’ అనే హాలీవుడ్ మూవీలో నటనకు కేట్ కు ఆస్కార్ వచ్చింది. దాన్ని షో కేస్ లో పెడితే వచ్చిన వాళ్లంతా తాకుతారని.. దొంగిలించే ఆస్కారం కూడా ఉందనే భయంతో బాత్రూమ్ లో పెట్టిందట. బాత్రూంలోనే ఎందుకంటే… అక్కడికి వెళ్లినవాళ్లు తడి చేతులతో ఆస్కార్ ని ముట్టుకోరు కదా అని లాజిక్ లాగుతోంది. అలా ఇంట్లోవాళ్ల బారి నుంచి, ఇంటికొచ్చే అతిథుల బారి నుంచి కూడా ఆస్కార్ ను కాపాడుకున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది కేట్.
« PREV
NEXT »

No comments

Post a Comment